మోదీ ఆ విషయంలో పికాసో.. బీఆర్ఎస్ సెటైర్!

  • ‘ఏప్రిల్ ఫూల్స్ డే’తో ముడిపెడుతూ మోదీపై బీఆర్ఎస్ విమర్శలు
  • ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపణ
  • మన దేశంలో ఫూల్స్ డేని ‘అచ్చే దిన్’ అంటారని ఎద్దేవా
తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలకు అదే రీతిలో బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. బండి సంజయ్ మాదిరే ‘ఏప్రిల్ ఫూల్స్ డే’తో ముడిపెడుతూ ఓ ట్వీట్ చేసింది. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించింది.

‘‘ఫూల్స్ డే: దేశంలో దీన్ని ‘అచ్చే దిన్’ అంటారు. మనల్ని మన ‘విశ్వ గురు’ ఎలా ఫూల్ చేశారో గుర్తు చేసుకుందాం’’ అని రాసి ఉన్న పోస్టర్ ను బీఆర్ఎస్ షేర్ చేసింది. బుల్లెట్ ట్రైన్, అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు, అందరికీ ఇళ్లు, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించడం, స్మార్ట్ సిటీలు, మహిళా భద్రత.. ఇలా అన్ని విషయాల్లో ఫూల్ చేశారని ఆరోపించింది. 

ఈ ట్వీట్ కు బీఆర్ఎస్ కూడా క్యాప్షన్ ఇచ్చింది. రవితేజ తాజా సినిమా ‘రావణాసుర’లోని డైలాగ్ ను గుర్తు చేసేలా.. ‘‘ప్రజలను మోసం చేయడం ఒక కళ అయితే.. మోడీ జీ అందులో పికాసో’’ అని సెటైర్ పేల్చింది.

Narendra Modi
Picasso
BRS satires on Modi
april fools day
achhe din

More Telugu News